ఒక రాజు ఓ జ్ఞాని వద్దకు వెళ్లి... నేను ప్రశాంతంగా ఉండ లేక పోతున్నాను" అన్నాడు.. "నువ్వు నీ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం లేదా?" అడిగారు ఆ జ్ఞాని. "మా రాజ్యానికి శత్రు భయం లేదు. దొంగల భయం లేదు. మా రాజ్యంలో పన్నులు తక్కువే. న్యాయ వ్యవస్థ కూడా బాగుంది. ఎక్కడా ఎవరికీ అన్యాయం జరగదు. ప్రజలందరూ ఆనందంగా ఉంటున్నారు. కానీ నాకే ప్రశాంతత లేదు. నేను ఏం చెయ్యాలి" రాజు ప్రశ్నించాడు. "సరే నీ బాధ అర్ధమైంది. నేనొకటి చెప్తాను. అలా చెయ్యి. నీ రాజ్యాన్ని నాకు ఇచ్చేసే" అన్నారు జ్ఞాని. "అంత కన్నా ఇంకేం కావాలి... తీసుకోండి. ఈ క్షణమే ఇచ్చేస్తున్నాను నా రాజ్యాన్ని" చెప్పాడు రాజు. "సరే నా కిచ్చావు. నువ్వేం చేస్తావు?" జ్ఞాని అడిగారు. "నేను ఎక్కడి కైనా వెళ్లి అక్కడ ఏదో ఒక పని చేసు కుంటూ బతుకుతాను" అన్నాడు రాజు. "ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? ఇక్కడే నా వద్దే నా ప్రతినిధిగా ఉండి నువ్వు చెయ్య వలసిన పనులు చెయ్యి. ఎందుకంటే నీకు పరిపాలన తెలుసు. చెయ్యగల సమర్దుడివి. ఓ ఏడాది తర్వాత వచ్చి లెక్కలు వగైరా చూస్తాను" చెప్పారు జ్ఞాని. ఒక సంవత్సరం గడిచిం...
ఈ రోజు రాజస్థాన్ లోని మేవాడ్ ను పరిపాలించిన రాజు మహారాణా ప్రతాప్ జయంతి .మహారాణా ప్రతాప్ మేవార్ రాజపుత్ రాజుల్లో ప్రముఖులు . గొప్ప యుద్ధవీరులు. అక్బర్ మహారణా ప్రతాప్ ని ఒకసారి తల దించి నా కాళ్ళ మీద పెడితే సగం హిందూస్థాన్కి రాజుని చేస్తా అని ప్రలోభపెట్టాడు. కానీ మహారణా ప్రతాప్ దాన్ని తుచ్ఛమైన కోరికని తిరస్కరించాడు. మరిచిపోలేని హల్దిఘాట్ యుద్దం లో మేవాడ్ సైన్యం 20000 సైనికులతో ఉంటే అక్బర్ సైన్యం 85000 సైనికులతో ఉంది. ఆ ఆయుద్దంలో 48000 మంది చనిపోయారు. ఇందులో 8000 మంది రాజ్పుతులు అయితే 40000 మంది మొఘలులు ఉన్నారు. మహారణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడంటారు. శ్రీ మహారణా ప్రతాప్ దగ్గర అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”.చేతక్ ఎంత బలమైనదంటే ఎదుట ఏనుగుమీద ఉన్న సైనికుణ్ణి అందుకోవటానికి అంత ఎత్తులో గాలిలో ఎగిరేది అది కూడా మహారణాతో పాటుగా. మహారణా ప్రతాప్ కి ఇష్టమైన ఆ గుర్రానికి తన త్యాగానికి గుర్తుగా ఒక గుడిని కూడా కట్టారు ,ఆ గుడి ఇప్పటికీ సురక్షితంగా ఉంది. అబ్రాహిం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ కి వచ్చే ముందు తన తల్లిని భారత్ నుండి ఏమి తీసుకొనిరా...