Skip to main content

Chetak

ఈ రోజు రాజస్థాన్ లోని మేవాడ్ ను పరిపాలించిన రాజు మహారాణా ప్రతాప్ జయంతి .మహారాణా ప్రతాప్ మేవార్ రాజపుత్ రాజుల్లో ప్రముఖులు . గొప్ప యుద్ధవీరులు.

అక్బర్ మహారణా ప్రతాప్ ని ఒకసారి తల దించి నా కాళ్ళ మీద పెడితే సగం హిందూస్థాన్కి రాజుని చేస్తా అని ప్రలోభపెట్టాడు. కానీ మహారణా ప్రతాప్ దాన్ని తుచ్ఛమైన కోరికని తిరస్కరించాడు.

మరిచిపోలేని హల్దిఘాట్ యుద్దం లో మేవాడ్ సైన్యం 20000 సైనికులతో ఉంటే అక్బర్ సైన్యం 85000 సైనికులతో ఉంది. ఆ ఆయుద్దంలో 48000 మంది చనిపోయారు. ఇందులో 8000 మంది రాజ్పుతులు అయితే 40000 మంది మొఘలులు ఉన్నారు. మహారణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడంటారు.

శ్రీ మహారణా ప్రతాప్ దగ్గర అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”.చేతక్ ఎంత బలమైనదంటే ఎదుట ఏనుగుమీద ఉన్న సైనికుణ్ణి అందుకోవటానికి అంత ఎత్తులో గాలిలో ఎగిరేది అది కూడా మహారణాతో పాటుగా. మహారణా ప్రతాప్ కి ఇష్టమైన ఆ గుర్రానికి తన త్యాగానికి గుర్తుగా ఒక గుడిని కూడా కట్టారు ,ఆ గుడి ఇప్పటికీ సురక్షితంగా ఉంది.

అబ్రాహిం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ కి వచ్చే ముందు తన తల్లిని భారత్ నుండి ఏమి తీసుకొనిరావాలి అని అడిగారట. దానికి ఆయన తల్లి “రాజస్థాన్లోని మేవాడ్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా , అక్కడి రాజు ఎంత విశ్వాసపాత్రుడుగా ఉండేవాడు అంటే సగం భారత్ ను ఇస్తా అని ప్రలోభపెట్టినా తన రాజ్య సుఖ శాంతి తన మాతృభూమినే కోరుకున్నాడు” అని చెప్పిందట.

ప్రపంచంలోని చిన్న దేశాల లో వియత్నాం ఒకటి . ప్రపంచంలోకల్లా అత్యంత బలశాలి అయిన అమెరికా తో 20 సంవత్సరాలు సాగిన యుద్దంలో ఆఖరికి అమెరికాను ఓడించింది. అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడికి ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు, అదేమిటంటే అమెరికాని ఓడించి యుద్దంలో ఎలా గెలిచారు అని, అప్పుడు ఆయన ఇలా సమాధాన మిచ్చారు -దేశాలలోకెల్లా శక్తిశాలి అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు ,శ్రేష్టమైన దేశభక్తిగల భారతీయ రాజు చరిత్రను చదివాను.అతని జీవనంనుండి ప్రేరణపొంది యుద్దనీతి ,ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్దంలో గెలిచాము. అతడే రాజస్తాన్లోని మేవాడ్ మహారాజు రాణా ప్రతాప్ సింహ్, ఒకవేళ అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవారం అన్నారట. కొన్ని రోజుల తరువాత వియత్నాం అధ్యక్షులు చనిపోయారు. అయితే ఆయన సమాధి మీద ఇలా రాశి ఉంది - “ఇది మహారణా ప్రతాప్ యొక్క శిష్యుడిది” అని .

అంతటి గొప్ప దేశ బక్తులు , సహాసశాలి అయిన మహారాణా ప్రతాప్ గారికి  ఘన నివాళులు అర్పిస్తున్నను

ఇది ఏ మహానుభావుడు వాడాడో తెలుసా ?
దేశం కోసం.... ధర్మం కోసం

మొగలుల గుండెలో దించిన కత్తి ఇదే!

ఈయన ఎత్తు 7 అడుగుల 5 అంగుళాల భారీ శరీరం కలవాడు . 
ఈయన వద్ద భారీ సైజుగల రెండు పెద్దకత్తులుండేవి .. వాటిలో ఒకటే ఇదీ
ఈ వీరుని దగ్గర 80కిలోల పెద్ద బల్లెం ఉండేదీ
ఈయన గుర్రం పేరు చేతక్

Comments