ఒక రాజు ఓ జ్ఞాని వద్దకు వెళ్లి... నేను ప్రశాంతంగా ఉండ లేక పోతున్నాను" అన్నాడు.. "నువ్వు నీ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం లేదా?" అడిగారు ఆ జ్ఞాని. "మా రాజ్యానికి శత్రు భయం లేదు. దొంగల భయం లేదు. మా రాజ్యంలో పన్నులు తక్కువే. న్యాయ వ్యవస్థ కూడా బాగుంది. ఎక్కడా ఎవరికీ అన్యాయం జరగదు. ప్రజలందరూ ఆనందంగా ఉంటున్నారు. కానీ నాకే ప్రశాంతత లేదు. నేను ఏం చెయ్యాలి" రాజు ప్రశ్నించాడు. "సరే నీ బాధ అర్ధమైంది. నేనొకటి చెప్తాను. అలా చెయ్యి. నీ రాజ్యాన్ని నాకు ఇచ్చేసే" అన్నారు జ్ఞాని. "అంత కన్నా ఇంకేం కావాలి... తీసుకోండి. ఈ క్షణమే ఇచ్చేస్తున్నాను నా రాజ్యాన్ని" చెప్పాడు రాజు. "సరే నా కిచ్చావు. నువ్వేం చేస్తావు?" జ్ఞాని అడిగారు. "నేను ఎక్కడి కైనా వెళ్లి అక్కడ ఏదో ఒక పని చేసు కుంటూ బతుకుతాను" అన్నాడు రాజు. "ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? ఇక్కడే నా వద్దే నా ప్రతినిధిగా ఉండి నువ్వు చెయ్య వలసిన పనులు చెయ్యి. ఎందుకంటే నీకు పరిపాలన తెలుసు. చెయ్యగల సమర్దుడివి. ఓ ఏడాది తర్వాత వచ్చి లెక్కలు వగైరా చూస్తాను" చెప్పారు జ్ఞాని. ఒక సంవత్సరం గడిచిం...